Bonda Uma: ఆ 150 పశువులు రాజధానిని నాశనం చేస్తున్నాయి: వైసీపీపై బోండా ఉమ ఫైర్

  • అమరావతిలో మా హయంలో ఎన్నో భవనాలు నిర్మించాం
  • వైసీపీ మాత్రం శ్మశానంలా మార్చాలని చూస్తోంది
  • బూతులకు కూడా ఒక మంత్రిని పెడతారా?

ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా వైసీపీ నేతలపై టీడీపీ నేత బోండా ఉమ తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. అమరావతిని 150 వైసీపీ పశువులు నాశనం చేస్తున్నాయని అన్నారు. అమరావతిని శ్మశానంతో పోల్చుతూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు.

తమ హయాంలో రాజధానిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులతో పాటు పలు భవనాలను నిర్మించామని... వైసీపీ మాత్రం రాజధానిని శ్మశానంలా మార్చాలని చూస్తోందని మండిపడ్డారు. కొడాలి నాని ఒక బూతుల మంత్రి అని విమర్శించారు. బూతులకు కూడా ఒక మంత్రిని పెడతారా? అని ప్రశ్నించారు.

Bonda Uma
Telugudesam
YSRCP
Kodali Nani
  • Loading...

More Telugu News