Devendra Fadnavis: సరైన సమయంలో సరైన విషయం చెబుతా!: ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు

  • అజిత్ పవార్‌తో కలవడంపై ఫడ్నవీస్ స్పందన
  • ఇదే మీరు చేసిన పొరపాటుగా భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించిన మీడియా
  • 'సరైన సమయంలో చెబుతా.. మీరేం బాధపడకండి' అంటూ జవాబు 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనుకున్న బీజేపీ నేత ఫడ్నవీస్ చివరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. తాము అజిత్ పవార్ తో కలవడంపై ఆయన స్పందించారు.

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన ఆయనను విలేకరులు మాట్లాడించే ప్రయత్నం చేశారు. అజిత్ పవార్‌తో కలవడం మీరు చేసిన పొరపాటుగా భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... 'నేను సరైన సమయంలో సరైన విషయం చెబుతాను. మీరేం బాధపడకండి' అంటూ సమాధానం ఇచ్చారు. కాగా, రేపు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

Devendra Fadnavis
BJP
Maharashtra
  • Loading...

More Telugu News