Kamma Rajyamlo Kadapa Redlu: 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' ఎలాంటి సినిమానో చెప్పేసిన వర్మ

  • ఇది మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా
  • ఏ వర్గాన్ని తక్కువ చేసి చూపించలేదు
  • చిన్నప్పటి నుంచి నాకు గిల్లుడు అలవాటు

రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' చిత్రం ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. కులాల మధ్య అంతరాన్ని పెంచేలా టైటిల్ ఉందంటూ కోర్టులో కొందరు పిటిషన్లు కూడా వేశారు. వర్మపై కొన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో వర్మ స్పందిస్తూ, 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని చెప్పారు. ఈ చిత్రంలో ఏ ఒక్క సామాజికవర్గాన్ని తక్కువ చేసి చూపించలేదని అన్నారు. ఈ సినిమాను ప్రముఖ తండ్రీకొడుకులకు అంకితమిస్తానని చెప్పారు.

మామూలు క్రైమ్ కంటే పొలిటికల్ క్రైమ్ ఎక్కువ ఆసక్తికరంగా ఉంటుందని వర్మ అన్నారు. చిన్నప్పటి నుంచి తనకు గిల్లుడు అలవాటని చెప్పారు. తనకు ఆసక్తిగా ఉన్న అంశాన్నే సినిమాగా తీస్తానని తెలిపారు.

Kamma Rajyamlo Kadapa Redlu
Ram Gopal Varma
RGV
Tollywood
  • Loading...

More Telugu News