shiv sena: రెండు చక్రాల కన్నా మూడు చక్రాలే బెటర్: ఫడ్నవీస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ కౌంటర్

  • ఆటోరిక్షా కూడా మూడు చక్రాలపై నడుస్తుందన్న ఫడ్నవీస్
  • మూడు చక్రాలు తలో దిశలో వెళితే ఏం జరుగుతుందో మనకు తెలుసని వ్యాఖ్య
  • ఫడ్నవీస్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేత అశోక్ చవాన్

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో బీజేపీ నేత ఫడ్నవీస్ స్పందిస్తూ.. 'ఆటోరిక్షా కూడా మూడు చక్రాలపై నడుస్తుంది. అయితే, మూడు చక్రాలు ఒకే దిశలో కాకుండా తలో దిశలో వెళితే ఏం జరుగుతుందో మనకు తెలుసు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి నెలకొంటుంది' అని వ్యాఖ్యానించారు.

ఫడ్నవీస్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ఆయనకు కౌంటర్ ఇచ్చారు. 'రెండు చక్రాల కన్నా మూడు చక్రాలే బెటర్' అని వ్యాఖ్యానించారు. తమ కూటమి ఉమ్మడి కార్యాచరణ విషయంపై ఆయనను ప్రశ్నించగా బీజేపీని అధికారం నుంచి దూరంగా ఉంచడమే తమ లక్ష్యమని అన్నారు. 

shiv sena
Maharashtra
BJP
Congress
  • Loading...

More Telugu News