Sonia Gandhi: తీహార్ జైలుకు వెళ్లి చిదంబరాన్ని కలిసిన సోనియా, రాహుల్!

  • రిమాండ్ ఖైదీగా ఉన్న చిదంబరం
  • త్వరలోనే కష్టాలు తీరుతాయి
  • పరామర్శించి ధైర్యం చెప్పిన సోనియా

ఐఎన్‌ఎస్‌ మీడియా కేసులో గత మూడు నెలలుగా తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరాన్ని పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు కలిశారు. ఈ ఉదయం జైలు వద్దకు చేరుకున్న వారు, నేరుగా లోపలికి వెళ్లి, దాదాపు 20 నిమిషాలకు పైగా చిదంబరంతో సమావేశం అయ్యారు. ఆయన్ను పరామర్శించిన సోనియా, త్వరలోనే కష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చినట్టు సమాచారం. జైలు నుంచి బయటకు వచ్చిన సోనియా, రాహుల్, తమ కోసం ఎదురు చూస్తున్న మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. వారి రాక సందర్భంగా జైలు ముందు భద్రతను పెంచారు.

Sonia Gandhi
Rahul Gandhi
Chidambaram
  • Error fetching data: Network response was not ok

More Telugu News