Amruta Fadnavis: కవిత రూపంలో వీడ్కోలు చెప్పిన అమృతా ఫడ్నవీస్... వైరల్!

  • నిన్న రాజీనామా చేసిన ఫడ్నవీస్
  • ట్విట్టర్ లో స్పందించిన అమృత
  • వసంతం కోసం ఎదురుచూస్తానని వెల్లడి

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ భార్య అమృత, కవితలు రాస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. తన భర్త సీఎం పదవికి రాజీనామా చేసిన తరువాత కూడా ఆమె, ఓ కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు చెప్పారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. ఇది శరధ్రుతువని ఆమె గుర్తు చేశారు. త్వరలోనే వసంతం వస్తుందని, సువాసనలు తిరిగి వస్తాయని, వాతావరణంలో మార్పు కోసం తాను ఎదురు చూస్తుంటానని అన్నారు.

గత ఐదేళ్లుగా మహారాష్ట్ర ప్రజలు తనపై ఎంతో ప్రేమను చూపారని, దాన్ని మరువలేనని అన్నారు. తన శక్తికొద్దీ, ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేశానని అన్నారు. కాగా, నిన్న సాయంత్రం బలపరీక్షను ఎదుర్కోవాల్సివున్న తరుణంలో, గెలుపు సాధ్యం కాదని భావించిన ఫడ్నవీస్, రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News