Rama Rao: రామారావుగారిని చూసి అందుకే అంతా భయపడేవారు: నటుడు శివకృష్ణ

  • రామారావుగారు నాకు దేవుడుతో సమానం
  • అయన ఎవరినీ ఏమీ అనేవారు కాదు 
  •  సంస్కారం వున్నవారిని అభిమానిస్తారన్న శివకృష్ణ

తెలుగు తెరపై విప్లవ కథానాయకుడిగా .. కేరక్టర్ ఆర్టిస్టుగా శివకృష్ణకి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "మొదటి నుంచి కూడా రామారావుగారంటే నాకు చాలా ఇష్టం. ఆయనని ఒక దేవుడిగానే నేను భావించేవాడిని. ఆయన స్ఫూర్తితోనే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాను. అలాంటి నాకు రామారావుగారితో కలిసి నటించే అవకాశం వచ్చింది.

అప్పటివరకూ హీరోగా చేసిన నేను, రామారావుగారితో అనే సరికి చిన్న పాత్రను చేయడానికి కూడా అంగీకరించాను. రామారావుగారి నిలువెత్తు విగ్రహం .. ఆయన గంభీరంగా వుండే తీరు .. ఆయన క్రమశిక్షణ చూసి మిగతా వాళ్లు భయపడేవారు. అంతేగానీ ఆయన ఎవరినీ ఏమీ అనేవారు కాదు. సభ్యత .. సంస్కారం వున్న వారిని ఆయన మరింత అభిమానిస్తారు. ఆయన నా పట్ల చూపిన అభిమానాన్ని .. ప్రోత్సహించిన తీరును నేను ఎప్పటికీ మరిచిపోలేను" అని చెప్పుకొచ్చారు.

Rama Rao
Shiva Krishna
  • Loading...

More Telugu News