Steve Smith: తనకు తాను శిక్ష... కావాలని బస్ మిస్ చేసుకుని మూడు కిలోమీటర్లు పరిగెత్తిన క్రికెటర్ స్టీవ్ స్మిత్!

  • పాక్ తో ఆసీస్ టెస్ట్ మ్యాచ్
  • 4 పరుగులకే అవుట్ అయిన స్మిత్
  • స్టేడియం నుంచి మైదానం వరకూ పరుగు

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్, తనకు తాను శిక్ష విధించుకున్నాడు. కావాలనే ఆటగాళ్ల బస్ ను మిస్ చేసుకుని, స్టేడియం నుంచి హోటల్ వరకూ మూడు కిలోమీటర్ల దూరం పరిగెత్తాడు. బ్రిస్బేన్ లో పాక్ తో జరుగుతున్న తొలి టెస్టులో స్పిన్నర్ యాసిర్ షా బంతిని వేయగా, దాన్ని అంచనా వేయడంలో విఫలమైన స్మిత్, క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

దీంతో తనకు తాను శిక్షను విధించుకున్నానని చెప్పాడు. తక్కువ స్కోరు చేస్తే, ఇలా పరిగెత్తడం, జిమ్ లో మరిన్ని కసరత్తులు చేయడం చేస్తానని, బాగా ఆడితే చాక్లెట్ బార్లను ఇచ్చుకుంటానని అన్నాడు. తదుపరి మ్యాచ్ లో రాణిస్తానన్న నమ్మకం ఉందని, యాసిర్ బౌలింగ్ లో మరింత క్రమశిక్షణగా ఆడతానని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్ లో పాక్ పై ఆసీస్ ఇన్నింగ్స్ 5 పరుగుల తేడాతో గెలిచింది. స్మిత్ చేసింది మాత్రం నాలుగు పరుగులే.

Steve Smith
Australia
Pakistan
Cricket
  • Loading...

More Telugu News