Vijay Sethupathi: విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతికి 4 కోట్లు!

  • తమిళ సినిమాల్లో హీరో పాత్రలు 
  • ఇతర భాషల్లో కీలకమైన పాత్రలు
  • భారీగా సంపాదిస్తున్న విజయ్ సేతుపతి

తమిళనాట విజయ్ సేతుపతికిగల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఒక వైపున అక్కడ హీరోగా చేస్తూనే మరో వైపున ఇతర భాషల్లో కీలకమైన పాత్రలను చేస్తూ ఫుల్ బిజీ అయ్యాడు. తన డిమాండ్ కి తగినట్టుగానే పారితోషికాన్ని కూడా గట్టిగానే తీసుకుంటున్నాడని అంటున్నారు. 'ఉప్పెన' సినిమా కోసం కూడా ఆయనకి భారీ పారితోషికమే ముడుతోందట.

బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు 'ఉప్పెన' సినిమాను నిర్మిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో, విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయనకి 2.5 కోట్లు ఇచ్చేలా మాట్లాడుకున్నారట. అయితే కాల్షీట్లు పెరగడం వలన అదనంగా ఆయన 1.5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆయనకి గల క్రేజ్ .. ఈ సినిమాలో ఆ పాత్రకి గల ప్రాధాన్యతను బట్టి నిర్మాతలు అంగీకరించినట్టు తెలుస్తోంది.

Vijay Sethupathi
  • Loading...

More Telugu News