Maharashtra: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సరికొత్త రికార్డు

  • నాలుగు రోజుల ముఖ్యమంత్రిగా రికార్డు
  • మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదో చరిత్ర
  • అత్యల్పకాలం సీఎంగా పనిచేసిన ఫడ్నవీస్

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రికార్డులకెక్కారు. అత్యల్పకాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిగా సరికొత్త రికార్డును తనపై రాసుకున్నారు. మహారాష్ట్ర చరిత్రలో గత 59 ఏళ్లలో నాలుగు రోజులు మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన వ్యక్తిగా సరికొత్త రికార్డు సృష్టించారు. అంతకుముందు 1963లో పీకే సావంత్ 25 నవంబరు నుంచి 4వ తేదీ డిసెంబరు వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు.

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మొదలైన తర్వాత అకస్మాత్తుగా ఈ నెల 23న ఉదయం ఫడ్నవీస్ సారథ్యంలోని ప్రభుత్వం కొలువుదీరింది. ఉదయం 8 గంటలలోపే ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్.. ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో నిన్న తన పదవికి రాజీనామా చేశారు.

Maharashtra
devendra fadnavis
record
  • Loading...

More Telugu News