Varun Tej: భారీగా పెరిగిన మెగా హీరో వరుణ్ తేజ్ పారితోషికం

  • వరుస విజయాలతో వరుణ్ తేజ్
  • భారీగా పెరిగిన మార్కెట్  
  • తాజా చిత్రానికి సన్నాహాలు

తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలను అందుకుంటున్న యువ కథానాయకులలో వరుణ్ తేజ్ కూడా చేరిపోయాడు. 'ఎఫ్ 2' హిట్ తరువాత ఆయన చేసిన 'గద్దలకొండ గణేశ్' కూడా భారీ విజయాన్ని కట్టబెట్టింది. అంతేకాదు .. మాస్ ఆడియన్స్ కి కూడా ఆయనను చేరువ చేసింది. ఈ సినిమాతో ఆయన మార్కెట్ పెరిగిపోయింది. ఈ కారణంగానే ఆయన పారితోషికం కూడా పెరిగిపోయినట్టు చెబుతున్నారు.

'ఎఫ్ 2' వరకూ 5 కోట్లకి పైగా పారితోషికం తీసుకున్న వరుణ్ తేజ్, తదుపరి సినిమా కోసం 10 కోట్లు అందుకున్నాడని అంటున్నారు. త్వరలో ఆయన కిరణ్ కొర్రపాటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమా కోసమే ఆయన ఈ మొత్తం పారితోషికం తీసుకున్నాడని చెబుతున్నారు. పారితోషికం పరంగా నాని .. విజయ్ దేవరకొండల స్థాయికి వరుణ్ తేజ్ సైలెంట్ గా చేరిపోవడం గమనార్హం. 

Varun Tej
Kiran Korrapati
  • Loading...

More Telugu News