Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కన్నడ చిత్రంలో ఛాన్స్ కొట్టిన కాజల్ 
  • 'ఆర్ఆర్ఆర్'కి కొత్త రిలీజ్ డేట్?
  • హిందీ సినిమాలో విజయ్ సేతుపతి  

   *  తెలుగులో ఆఫర్లు తగ్గడంతో కథానాయిక కాజల్ ఏ భాష నుంచి అవకాశాలు వచ్చినా అంగీకరిస్తోంది. ఈ క్రమంలో కన్నడ నుంచి ఆమెకు తాజాగా ఓ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా నటించే 'కబ్జా' చిత్రంలో నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు వచ్చినట్టు సమాచారం.
*  ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రం 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. మొదట్లో నిర్మాతలు ప్రకటించినట్టుగా ఇది వచ్చే ఏడాది జూలై 30న విడుదల కాకపోవచ్చని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దీనిని వచ్చే ఏడాది అక్టోబర్ 2న విడుదల చేయనున్నారంటూ కొత్తగా ఓ డేట్ ప్రచారంలోకి వచ్చింది. దీనిపై త్వరలోనే నిర్మాతలు క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.
*  తమిళంలో హీరోగా కొనసాగుతూనే ఇతర భాషల నుంచి మంచి క్యారెక్టర్లు చేసే అవకాశం వస్తే వదులుకోని విజయ్ సేతుపతి ఇప్పుడు హిందీలో అమీర్ ఖాన్ నటించే చిత్రంలో కూడా నటించనున్నాడు. హాలీవుడ్ చిత్రం 'ఫారెస్ట్ గంప్'కి రీమేక్ గా రూపొందే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తాడట.   

  • Error fetching data: Network response was not ok

More Telugu News