Prakasam District: ప్రకాశం జిల్లాలో దగ్ధమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. తప్పిన ప్రమాదం

  • పామూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు
  • డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
  • షార్ట్ సర్క్యూటే కారణం

ప్రకాశం జిల్లాలో గత రాత్రి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పామూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి సమీపంలోకి రాగానే మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులను హెచ్చరించాడు. వారంతా బస్సు దిగి పరుగులు తీశారు. ఆ తర్వాత క్షణాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Prakasam District
private travels bus
Fire Accident
  • Loading...

More Telugu News