CM Jagan Review on Raithu Barosa adn YSR Nava Shakam: ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఆర్థిక సాయంపై సీఎం జగన్ ఆదేశాలు

  • రైతు భరోసా, వైఎస్ఆర్ నవశకం లబ్ధిదారుల ఎంపికపై అధికారులతో సమీక్ష 
  • ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్ఆర్ నేతన్న నేస్తం వర్తింపు
  • ఇసుక వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక వాహనాలకు జీపీఎస్ తప్పనిసరని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతు భరోసా కింద 45.82 లక్షల మందికి చెల్లింపులు పూర్తి చేశామని వెల్లడించారు. మరో 2.14 లక్షల మంది రైతులకు వారంలోగా చెల్లించాలని అధికారులకు సూచించారు. వర్క్ షాపుల ఏర్పాటుపై కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. డిసెంబర్ 10వ తేదీనాటికి ఇసుక రవాణా చేసే ప్రతీ వాహనానికి జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ రోజు జగన్ రైతు భరోసా, వైఎస్ఆర్ నవశకం లబ్ధిదారుల ఎంపికపై అధికారులతో సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘రైతులకు ధాన్యం సొమ్ము చెల్లింపులో ఆటంకాలు రాకూడదు. ఆరోగ్యశ్రీకి ఏడాదికి రూ.268.13 కోట్లు ఖర్చవుతుందని మా అంచనా. శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఇచ్చే ఆర్ధిక సాయం నగదును ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 48 గంటల్లో రోగుల ఖాతాల్లో వేయాలి. 836 రకాల శస్త్ర చికిత్సలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్ఆర్ నేతన్న నేస్తం వర్తింపు చేస్తాం. డిసెంబర్ 21న చేనేత కుటుంబాలకు రూ.24 వేల ఆర్థిక సాయం అందించనున్నాం. జనవరి 1నుంచి పొరుగు సేవల సిబ్బందికి కార్పొరేషన్ ద్వారా వేతనాలు ఇస్తాం. డిసెంబర్ 15 నాటికి పొరుగుసేవల సిబ్బంది జాబితా సిద్ధం చేయాలి. ఇసుక ధర, లభ్యతపై ప్రతివారం జిల్లాస్థాయిలో పత్రికల ద్వారా సమాచారం ఇవ్వాలి’ అని చెప్పారు.

CM Jagan Review on Raithu Barosa adn YSR Nava Shakam
Andhra Pradesh
  • Loading...

More Telugu News