Maharashtra: ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిగా ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధమైన శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్

  • సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్ థాకరేను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కూటమి ఎమ్మెల్యేలు
  • డిసెంబర్ 1న శివాజీ పార్క్ లో ప్రమాణ స్వీకారం చేయనున్న ఉద్ధవ్
  • కాసేపట్లో గవర్నర్ ను కలవనున్న కూటమి నేతలు

మహారాష్ట్రలో అధికారం చేపట్టడానికి సమాయత్తమవుతున్న శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ తమ కూటమికి ‘మహా వికాస్ అఘాడీ’ గా పేరును ఖరారు చేశారు. సాయంత్రం ముంబైలోని ట్రైడెంట్ హోటల్లో సమావేశమైన ఈ కూటమి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేను ఎన్నుకున్నారు.

థాకరే పేరును ఎన్సీపీ శాసనసభాపక్ష నేత జయంత్ పాటిల్ ప్రతిపాదించగా.. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బాలాసాహెబ్ థోరట్ బలపర్చారు. ఫలితంగా సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్ థాకరే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లైంది. కాసేపట్లో ఈ మూడు పార్టీల నేతలు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలవనున్నారు. రేపు ప్రొటెం స్పీకర్ కాళిదాస్ సమక్షంలో కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. సీఎంగా ఉద్ధవ్ థాకరే డిసెంబర్ 1న ముంబైలోని శివాజీ పార్క్ లో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News