Telugudesam: చంద్రబాబు! నీ వల్ల హత్య గావించబడ్డ ఎన్టీ రామారావు కేసు ఎంక్వయిరీ చేద్దాం: శ్రీకాంత్ రెడ్డి

  • వైఎస్ వివేకా హత్య కేసు విచారణ చక్కగా జరుగుతోంది
  • నువ్వు ఆడిన నాటకాలు సహా అన్నీ బయటకొస్తాయి
  • ఎందుకు తొందరపడుతున్నావు?

వైఎస్ వివేకా హత్య కేసు గురించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు తొందరపడుతున్నారని, అన్ని వాస్తవాలు బయటకొస్తాయని అన్నారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ‘చాలా పర్ఫెక్టుగా’ జరుగుతోందని, చంద్రబాబు చేసిన కుట్రలు, కుతంత్రాలు, ఆడిన నాటకాలు సహా అన్నీ బయటకొస్తాయని చెప్పారు.

'నీ వల్ల హత్య గావించబడ్డ ఎన్టీ రామారావు కేసును కూడా ఎంక్వయిరీ చేద్దాం. వాస్తవాలు బయటకొస్తాయి. ఎందుకు తొందరపడుతున్నావు? అన్నీ బయటకు తెచ్చి ప్రజలకు క్లిస్టర్ క్లియర్ గా తెలియజేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ప్రతి వ్యవస్థను సర్వనాశనం చేసిన చంద్రబాబే ‘ఆంబోతు’ అని, తమ ఎమ్మెల్యేలు కాదని అన్నారు.

Telugudesam
Chandrababu
YSRCP
srikanth reddy
  • Loading...

More Telugu News