Venezuela Jeans Pants: వెరైటీగా ప్యాంట్లు చోరీ చేసిన యువతి!

  • ఒకదానిపై ఒకటిగా మొత్తం 8 ప్యాంట్లు ధరించి ఉడాయించే ప్రయత్నం
  • వెనిజుల వస్త్ర దుకాణంలో ఘటన
  • వైరల్ గా మారిన చోరీ దృశ్యాలు

చోరీలు చేయడంలో యువతీ, యువకులు విభిన్నదారులను వెతుకుతున్నారు. వీరి అద్భుత చోర నైపుణ్యాలను చూస్తే.. ఈ విధంగా కూడా దొంగతనం చేయవచ్చా? అని అంతా ముక్కుమీద వేలేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. వెనిజులకు చెందిన ఓ యువతి ఓ వస్త్ర దుకాణంలోకి ప్రవేశించి తనకు నచ్చిన జీన్స్ ప్యాంట్లను ఎంపిక చేసుకుంది.

వాటిని ట్రయల్ రూంలో చెక్ చేసుకుంటానని చెబుతూ..  ఒకదానిపై మరొక జీన్స్ వేసుకోవడం ప్రారంభించింది ఆ విధంగా ఆమె 8 ప్యాంట్లను ధరించింది. అనంతరం అక్కడినుంచి మెల్లగా జారుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె ప్రవర్తనను అనుమానించిన యజమానులు ఆమెను నిలువరించారు. వాష్ రూంలోకి తీసుకుపోయి ఆమె ప్యాంట్లను ఒక్కొక్కటిగా విప్పదీయించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇప్పటివరకు సుమారు 40 లక్షల మందికి పైగా దీనిని వీక్షించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News