Andhra Pradesh: కేంద్రం ఏపీ రాజధానిపై క్లారిటీ ఇచ్చింది: కన్నా

  • అమరావతిని మ్యాప్ లో చూపించారన్న కన్నా
  • సీఎం జగన్ కూడా అధికారులకు సూచనలు చేశారని వెల్లడి
  • త్వరలో రాష్ట్రానికి అమిత్ షా, నడ్డా వస్తున్నారన్న కన్నా

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో కేంద్రం స్పష్టతనిచ్చిందని తెలిపారు. ఇండియా మ్యాప్ లో అమరావతిని కూడా చూపారని వెల్లడించారు.

సీఎం జగన్ కూడా అమరావతి నిర్మాణంపై వెంటనే దృష్టి సారించి, నిలిచిపోయిన నిర్మాణ పనులను పూర్తిచేసేందుకు మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేగాకుండా, రాష్ట్రంలో తమ పరిస్థితిపైనా కన్నా స్పందించారు. వచ్చే ఎన్నికల సమయానికి రాష్ట్రంలో ప్రబలశక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. మరికొన్ని రోజుల్లో ఏపీకి అమిత్ షా, జేపీ నడ్డా వస్తున్నారని వెల్లడించారు.

Andhra Pradesh
Amaravathi
Kanna
BJP
Jagan
YSRCP
  • Error fetching data: Network response was not ok

More Telugu News