Hindupuram: హిందూపురంలో ‘సామూహిక కోటి దీపోత్సవం’ను నిర్వహించిన నందమూరి బాలకృష్ణ .. ఫొటోలు ఇవిగో!
![](https://imgd.ap7am.com/thumbnail/tn-ca61dcb31486.jpg)
- ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మనందరి కీ ఉండాలి
- అందరూ సుఖసంతోషాలతో ఉండాలి
- కోటి దీపోత్సవంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు
పవిత్రమైన కార్తీక మాసం శుభసందర్భంగా, ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరుకున్నారు. ఈ మేరకు ఓ పోస్ట్ చేశారు. హిందూపురంలో తన కుటుంబసభ్యులతో కలిసి తాను నిర్వహించిన ‘సామూహిక కోటి దీపోత్సవం’ కార్యక్రమానికి తరలివచ్చిన వారందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పరమేశ్వరుడి కృపతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తన పోస్ట్ లో బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను జతపరిచారు. కాగా, హిందూపురంలో నిన్న రాత్రి ‘సామూహిక కోటి దీపోత్సవం’ ను నిర్వహించారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-e3f6ec71146372e472703f92967ccaa936ce4633.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-b7535dbc2855f3f949a74aef42f28a65109ad8a9.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-3b6246d44ab1cf05d641d90ed04713d5fb881024.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-f2ee3873bbe6d03f7c0575c613ee29e1105f03c6.jpg)