Maharashtra: రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్... అందరూ ఓ లుక్కేయండి: ప్రకాశ్ రాజ్

  • రేపు మహా అసెంబ్లీలో బలనిరూపణ
  • ట్విట్టర్ లో స్పందించిన ప్రకాశ్ రాజ్
  • బీజేపీ అధినాయకత్వంపై పరోక్ష వ్యాఖ్యలు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మహారాష్ట్ర రాజకీయాలపై తనదైన శైలిలో వ్యంగ్యం కురిపించారు. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఎపిసోడ్ కనిపిస్తుందేమో... అంటూ ట్వీట్ చేశారు. ఓ అధినేత, మరో చాణక్యుడు, వారి పెంపుడు చిలుకలతో కూడిన అర్థరాత్రి అంతరాత్మల మూకుమ్మడి రాజకీయం ఎలా ఉంటుందో రేపు అందరూ చూడాల్సిందేనంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. రేపు మహారాష్ట్ర శాసనసభలో బీజేపీ సర్కారు బలనిరూపణ చేసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ బీజేపీ అధినాయకత్వాన్ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసినట్టు అర్థమవుతోంది.

Maharashtra
Prakash Raj
BJP
Narendra Modi
Amit Shah
  • Loading...

More Telugu News