Botsa Satyanarayana: అమరావతిపై బొత్స వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • అమరావతిని శ్మశానంతో పోల్చిన బొత్స
  • వెల్లువెత్తుతున్న విమర్శలు
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ యువ ఎంపీ

ఏపీ రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. బొత్స సత్యనారాయణ అమరావతిని శ్మశానంతో పోల్చడం సరికాదని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. అమరావతి నగరం ఎంతో మంది ఆశలకు, ఆశయాలకు, రాష్ట్ర ప్రజల కలలకు ప్రతీకగా నిర్మితమవుతోందని, అలాంటి నగరాన్ని అవమానించే వ్యాఖ్యలు చేసిన బొత్స ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలను బొత్స ఉపసంహరించుకోవాలని తెలిపారు.

Botsa Satyanarayana
Ram Mohan Naidu
Telugudesam
YSRCP
Amaravathi
  • Loading...

More Telugu News