Revanth Reddy: ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోండి: మోదీ, గడ్కరీని కోరిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
- 50 వేల మంది కార్మికుల జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారు
- తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది
- కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందన్న రేవంత్
ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు ఫిర్యాదు లేఖను ప్రధాని కార్యాలయ కార్యదర్శికి అందించారు. 50 వేల మంది కార్మికుల జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారని చెప్పారు. ఆర్టీసి కార్మికుల బాధల పట్ల తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు.
అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు పడుతోన్న ఇబ్బందులను తాము గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామని రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని చెప్పారు.