varla ramaiah: ముఖ్యమంత్రి గారూ.. ఈ విషయాల్లో మీరు ఎందుకు వెనుకాడుతున్నారు?: వర్ల రామయ్య

  • న్యాయ స్థానాలకు హాజరవ్వాలన్నా వెనుకాడుతారు
  • చట్టపరమైన చర్చలలో పాల్గొనాలన్నా వెనుకాడుతారు
  • రాజ్యాంగ పరమైన సమావేశాల్లో ప్రసంగించాలన్నా వెనుకాడుతున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజభవన్ లో జరిగే సభకు ఎందుకు వెళ్లడం లేదని ఆయన నిలదీశారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారా? అంటూ ట్వీట్ చేశారు.

'ముఖ్యమంత్రి గారూ... న్యాయ స్థానాలకు హాజరవ్వాలన్నా, చట్టపరమైన చర్చలలో పాల్గొనాలన్నా, రాజ్యాంగ పరమైన సమావేశాల్లో ప్రసంగించాలన్నా ఎందుకు మీరు వెనుకాడుతున్నారు?  ఈ రోజు 70 వ రాజ్యాంగ దినోత్సవం కదా? ఎందుకు  రాజభవన్ లో జరిగే సభకు వెళ్లడం లేదు? రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారా, అంబేడ్కర్ నా ?' అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

varla ramaiah
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News