Yanamala: సీఎం జగన్ శ్మశానంలో కూర్చొని రాష్ట్రాన్ని పాలిస్తున్నారా?: యనమల రామకృష్ణుడు

  • మంత్రి బొత్సను వెంటనే బర్తరఫ్‌ చేయాలి
  • చట్టసభలను అవమానించినందుకు ప్రివిలేజ్ నోటీసులిస్తాం 
  • రాజధానిని శ్మశానంతో పోల్చడమేంటి?

మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, రాజధానిని శ్మశానంతో పోల్చడం దారుణమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర మంత్రులు శ్మశానంలో కూర్చొని పాలన కొనసాగిస్తున్నారా? అంటూ నిలదీశారు. మంత్రి బొత్సను వెంటనే బర్తరఫ్‌ చేయాలని, చట్టసభలను అవమానించినందుకు ప్రివిలేజ్ నోటీసులిస్తామని తెలిపారు.

ప్రజా దేవాలయం వంటి శాసనసభను, సచివాలయాన్ని శ్మశానంతో పోల్చడమేంటని యనమల విమర్శలు గుప్పించారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 28వ తేదీన అమరావతి పర్యటనకు వెళ్లనున్నారు. రాజధాని శ్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నావా? అంటూ ఆయనపై బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. దీనిపై టీడీపీ నేతలు విమర్శల జల్లు కురిపిస్తున్నారు.

Yanamala
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News