TSRTC: నురగలు కక్కుకుని పడిపోయిన సంగారెడ్డి ఆర్టీసీ కార్మికుడు

  • సంగారెడ్డి డిపోకు వచ్చిన కండక్టర్ భీమ్లా
  • అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించిన పోలీసులు
  • పీఎస్ లో నురగలు కక్కుకుని కిందపడిపోయిన భీమ్లా

ఉద్యోగం పోతుందనే భయంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒత్తిడికి తట్టుకోలేక ఇప్పటికే కొందరు కార్మికులు మరణించగా... తాజాగా ఈ ఉదయం మరో ఘటన చోటు చేసుకుంది. విధుల్లో చేరేందుకు సంగారెడ్డి డిపోకు వచ్చిన కండక్టర్ భీమ్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పీఎస్ లో భీమ్లా నురగలు కక్కుకుని కిందపడిపోయాడు. ఆయనను తోటి కార్మికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగం పోతుందన్న భయంతోనే భీమ్లా గుండెపోటుకు గురయ్యాడని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద సెక్షన్ 144 కొనసాగుతోంది. కార్మికులెవరినీ పోలీసులు డిపోల్లోకి అనుమతించడం లేదు. లోపలకు వెళ్లేందుకు యత్నిస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

TSRTC
Strike
Conductor
Heart Attack
  • Loading...

More Telugu News