Somireddy: చిన్న పల్లెను కూడా ఆ విధంగా పోల్చడానికి ఎవరికీ మనసు రాదు: బొత్సపై సోమిరెడ్డి ఫైర్

  • అమరావతిని శ్మశానంతో పోల్చడం దిగజారుడుతనానికి నిదర్శనం
  • రాజధానిని నిర్వీర్యం చేశారు
  • ప్రజలకు క్షమాపణ చెబితే గౌరవంగా ఉంటుంది

ఈ నెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో పర్యటించనున్న నేపథ్యంలో, మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ... 'రాజధాని శ్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నావా బాబూ' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బొత్స వ్యాఖ్యలపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.

దేశం గుర్తించిన అమరావతిని శ్మశానంతో పోల్చడం బొత్స దిగజారుడుతనానికి నిదర్శనమని సోమిరెడ్డి విమర్శించారు. చిన్న పల్లెను కూడా ఆ విధంగా పోల్చడానికి ఎవరికీ మనసు రాదని అన్నారు. జరుగుతున్న పనులను ఆపేసి, రాజధానిని నిర్వీర్యం చేసి, ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు... ప్రజలకు క్షమాపణ చెపితే గౌరవంగా ఉంటుందని సూచించారు.

Somireddy
Botsa Satyanarayana
Chandrababu
Amaravathi
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News