Chandrababu: చంద్రబాబూ... మరి ఇన్నాళ్లూ వచ్చిన డబ్బు ఎవరి జేబులోకి వెళ్లింది?: విజయసాయి రెడ్డి

  • వారం రోజుల్లో ఇసుకను అమ్మితే రూ. 63 కోట్ల ఆదాయం వచ్చింది
  • ఇదే ఆదాయం వస్తే, ఏటా వేల కోట్ల ఆదాయం వస్తుంది
  • ఇన్నాళ్లూ తినేశారా? అని ప్రశ్నాస్త్రాలు

కేవలం వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ. 63 కోట్ల ఆదాయం వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఉదయం స్పందించిన ఆయన, "వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. సంవత్సరమంతా చూస్తే ఇది వేల కోట్లలోకి వెళ్తుంది. మరి ఇన్నాళ్లు ఈ రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్లింది చంద్రబాబు గారూ? పచ్చ ఇసుక మాఫియా ద్వారా మీకూ వాటా ముట్టేది. అందుకే ఇసుక కొరతపై ఇంత రాద్ధాంతం చేశారు" అని ఆయన విమర్శలు గుప్పించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News