jayalalitha: జయలలిత జీవితంపై ఒకేసారి మూడు సినిమాలు.. కంగన సూటవలేదంటూ విమర్శలు!

  • రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్
  • జయ పాత్రకు కంగన సూట్ కాలేదంటూ విమర్శలు
  • శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మూడు చిత్రాలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై ఒకేసారి మూడు బయోపిక్‌లు రాబోతున్నాయి. ఇందులో  ప్రియదర్శిని దర్శకత్వంలో నిత్యామీనన్ నటిస్తున్న ‘ది ఐరన్‌ లేడీ’ ఒకటి కాగా, ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ నటి కంగనారౌనత్‌ నటిస్తున్న ‘తలైవి’ రెండోది. మరోపక్క ‘క్వీన్’ పేరుతో రమ్యకృష్ణ‌‌తో గౌతమ్‌వాసుదేవ మీనన్‌ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఈ మూడు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండడం మరో విశేషం.

‘క్వీన్’, ‘ది ఐరన్ లేడీ’ సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్ ఇప్పటికే బయటకు వచ్చింది. తాజాగా, ‘తలైవి’ సినిమా నుంచి కూడా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దీంతో ఈ మూడింటిలో జయలలిత పాత్రకు ఎవరు సూటయ్యారన్న చర్చ ఇప్పుడు మొదలైంది. క్వీన్, ఐరన్ లేడీ సినిమా ఫస్ట్‌లుక్‌లపై మంచి స్పందన కనిపించగా, ‘తలైవి’లో కంగన పాత్రలో సహజత్వం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

jayalalitha
Tamil Nadu
biopic
kangana
  • Loading...

More Telugu News