indian constitution: రాజ్యాంగానికి నేటితో 70 వసంతాలు.. పార్లమెంటులో ఘనంగా వేడుకలు

  • ఏడు దశాబ్దాల క్రితం సరిగ్గా ఇదే రోజున రాజ్యాంగానికి ఆమోదం
  • ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి, ప్రధాని ప్రసంగం
  • ఏడాది పాటు అవగాహన కార్యక్రమాలు

భారత రాజ్యాంగానికి నేటితో 70 ఏళ్లు పూర్తికానున్నాయి. భారత రాజ్యాంగాన్ని ఏడు దశాబ్దాల క్రితం సరిగ్గా ఇదే రోజున అంటే 26 నవంబరు 1949న రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేడు పార్లమెంటులో వేడుకలు నిర్వహించనున్నారు. సెంట్రల్‌హాల్‌లో జరిగే ఉభయసభల చారిత్రక సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్‌ ఓం బిర్లా ప్రసంగిస్తారు. కాగా, రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏడాదిపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
https://www.facebook.com/anu.rajeswari/videos/3186368388103631


indian constitution
parliament of india
Narendra Modi
Ram Nath Kovind
  • Loading...

More Telugu News