South Asian Game: తెలంగాణ అమ్మాయిల సత్తా... భారత టెన్నిస్ జట్టులో నలుగురికి చాన్స్!

  • 1 నుంచి దక్షిణాసియా క్రీడలు
  • నేపాల్ లో జరుగనున్న పోటీలు
  • టెన్నిస్ జట్ల ప్రకటన

త్వరలో జరిగే దక్షిణాసియా క్రీడల్లో భారత జట్టు తరఫున పాల్గొనే టెన్నిస్ జట్లను ప్రకటించగా, నలుగురు తెలంగాణ అమ్మాయిలకు స్థానం లభించింది. డిసెంబర్ 1 నుంచి 12 వరకూ నేపాల్ లో పోటీలు జరుగనుండగా, పురుషుల, మహిళల జట్లకు కోచ్ గా జాతీయ మాజీ చాంపియన్ అశుతోశ్ సింగ్ వ్యవహరించనున్నారు.

 ఇక తెలంగాణ నుంచి నేషనల్ చాంపియన్ భవిశెట్టి సౌజన్యతో పాటు సామ స్వాతిక, చిలకలపూడి శ్రావ్య శివానీ, కాల్వ భువనలకు జట్టులో స్థానం లభించింది. వీరితో పాటు ప్రేరణా బాంబీ, ప్రార్థనా తొంబారే మహిళల జట్టులో ఉంటారు. ఇక పురుషుల జట్టు విషయానికి వస్తే, తెలంగాణకు చెందిన విష్ణువర్థన్, ఏపీకి చెందిన సాకేత్ మైనేని, నిక్కీ పునాచా, తమిళనాడుకు చెందిన మనీశ్ సురేశ్ కుమార్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెడుంజెళియన్ లకు చోటు దక్కింది.

South Asian Game
Nepal
Tennis
Telangana
  • Loading...

More Telugu News