Hong kong: హాంకాంగ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన చైనా ప్రభుత్వ అనుకూలురు!
- 18 జిల్లాల్లోని 452 స్థానాలకు ఎన్నికలు
- 388 స్థానాల్లో ప్రజాస్వామ్య అనుకూలవాదుల విజయం
- ఓటమి పాలైన 155 మంది ప్రభుత్వ అనుకూలురు
హాంకాంగ్ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూలవాదులు భారీగా విజయం సాధించి చైనాకు షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ అనుకూలురు అతి కొద్దిమంది మాత్రమే విజయం సాధించడం విశేషం. 18 జిల్లాల్లోని 452 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 388 మంది ప్రజాస్వామ్య అనుకూలవాదులు గెలుపొందారు. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించగా, ప్రభుత్వ అనుకూలురు 59 మంది మాత్రమే గెలిచి, 155 మంది ఓటమి పాలయ్యారు. ప్రజాస్వామ్య అనుకూలవాదులు అధిక సంఖ్యలో గెలుపొందినప్పటికీ హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను ఎన్నుకునే 1,200 మందితో కూడిన ఎలక్టోరల్ కాలేజీ చైనా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది.