BSNL-MTNL VRS: బీఎస్ఎన్ఎల్,ఎంటీఎన్ఎల్ వీఆర్ఎస్ కు అనూహ్య స్పందన

  • ఇప్పటివరకు 92వేల దరఖాస్తులు
  • డిసెంబర్ 3న ముగియనున్న గడువు
  • బీఎస్ఎన్ఎల్ లో వీఆర్ఎస్ కు లక్షమంది అర్హులు

ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ లో కొనసాగుతున్న వీఆర్ఎస్ పథకానికి ఉద్యోగుల నుంచి ఊహించని స్పందన వస్తోంది. డిసెంబర్ 3న ముగియనున్న గడువుకు ఎనిమిదిరోజుల ముందే దరఖాస్తుల సంఖ్య 92 వేలకు చేరింది. బీఎస్ఎన్ఎల్ లో మొత్తం 1.5 లక్షల మంది ఉద్యోగులుండగా, వీరిలో సుమారు లక్ష మంది వీఆర్ఎస్ కు అర్హులున్నారు.

ఈ పథకంలో భాగంగా వీఆర్ఎస్ ను ఎంపిక చేసుకున్నవారికి ఇప్పటివరకు పూర్తిచేసుకున్న సర్వీసుకుగాను ఏడాదికి 35 రోజుల వేతనం, మిగిలిన సర్వీసు కాలానికి ఏడాదికి 25 రోజుల వేతనం చొప్పున ఇవ్వనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ స్థాయిలో వీఆర్ఎస్ కు దరఖాస్తులు రావడం ఇదే ప్రథమమని అధికార వర్గాలు తెలుపుతున్నాయి.

BSNL-MTNL VRS
Response from Employees
  • Loading...

More Telugu News