Ajit pawar: అజిత్ పవార్ పై వున్న కేసులను మూసివేయలేదన్న మహారాష్ట్ర ఏసీబీ

  • అజిత్ కు సంబంధించి తొమ్మిది కుంభకోణం కేసులు
  • ఈరోజు మూసివేసిన కేసులు ఆయనవి కావు
  • మహారాష్ట్ర ఏసీబీ డీజీ పరంబీర్ సింగ్

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పై వున్న కుంభకోణం కేసుల నుంచి ఆయనకు క్లీన్ చిట్ లభించిందంటూ వస్తున్న వదంతులపై ఏసీబీ అధికారులు వివరణ ఇచ్చారు. మహారాష్ట్రలో ఫడ్నవీస్ సర్కార్ ఏర్పాటుకు అజిత్ పవార్ మద్దతు ఇవ్వడం వల్లే ఆయనపై వున్న సాగునీటి కుంభకోణం కేసులో విచారణను పక్కనబెట్టారన్న విమర్శలను ఖండించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జనరల్ పరంబీర్ సింగ్ మాట్లాడుతూ, అజిత్ కు సంబంధించిన తొమ్మిది కేసుల్లో ఏ ఒక్క కేసునూ మూసివేయలేదని చెప్పారు. ఈరోజు మూసివేసిన కేసులు ఆయనకు సంబంధించినవి కావని స్పష్టం చేశారు.

Ajit pawar
Maharashtra
Deputy cm
ACB
  • Loading...

More Telugu News