Thaman: తమన్ కు 'పెర్ల్ మాలెట్ వర్క్ స్టేషన్' ను కానుకగా ఇచ్చిన సాయిధరమ్ తేజ్

  • 'ప్రతిరోజూ పండగే' చిత్రంలో నటిస్తున్న సాయిధరమ్ తేజ్
  • సంగీతం అందిస్తున్న తమన్
  • ఆశ్చర్యపోయానంటున్న తమన్

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న 'ప్రతిరోజూ పండగే' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన కొన్ని పాటలకు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో తమన్ ను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ సాయిధరమ్ తేజ్ ఓ కానుక ఇచ్చాడు. దానిపేరు 'పెర్ల్ మాలెట్ వర్క్ స్టేషన్'.

రికార్డింగ్ సమయంలో సంగీత దర్శకుల పనితీరును ఎంతో సులభతరం చేసే ఈ 'పెర్ల్ మాలెట్ వర్క్ స్టేషన్' ను చూసి తమన్ మురిసిపోయాడు. సాయిధరమ్ తేజ్ ను తన ప్రియమిత్రుడిగా పేర్కొన్న తమన్ 'పెర్ల్ మాలెట్' ను తనకు బహుమతిగా ఇవ్వడం ద్వారా 'ప్రతిరోజూ పండగే' అనే టైటిల్ ను నిజం చేశాడని ట్వీట్ చేశాడు. సాయిధరమ్ తేజ్ వంటి మంచి మనసున్న వ్యక్తికి మరిన్ని విజయాలు దక్కాలని ప్రార్థిస్తున్నాను అంటూ పేర్కొన్నాడు.

Thaman
Saidharam Tej
Tollywood
Pearl Mallet Workstation
  • Loading...

More Telugu News