Chandrababu: చంద్రబాబు 40 దేవాలయాలు కూల్చినప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడికెళ్లారు?: మల్లాది విష్ణు ఫైర్

  • తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన మల్లాది
  • జగన్ చేపడుతున్న పథకాలు కనిపించడంలేదా అంటూ ఆగ్రహం
  • చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అంటూ వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్మే మల్లాది విష్ణు జనసేనాని పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ మత రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేవాలయాల నుంచి తీసుకునే దానికంటే ఎక్కువ నిధులనే దేవాలయాల కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతోందని తెలిపారు. ఈ విషయం మీకు తెలియకపోతే మీ దత్తత తండ్రి చంద్రబాబును అడిగి తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు.

"ఆనాడు చంద్రబాబు 40 దేవాలయాలు కూల్చివేస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదు? పుష్కరాల్లో చంద్రబాబు వల్ల 30 మంది చనిపోతే పవన్ ఏమయ్యారు? దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగితే పవన్ ఎక్కడికెళ్లారు? జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పవన్ కు కనిపించడం లేదా?" అంటూ ఘాటుగా విమర్శించారు.

ఓ ఉన్మాదిలా, ఓ పిచ్చివాడిలా పవన్ ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. రెండు చోట్ల ప్రజలు ఓడించినా మీకు ఇంకా జ్ఞానోదయం కాలేదంటూ మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో పవన్ కీలుబొమ్మలా మారాడని, రాష్ట్రాన్ని కులాలు, మతాలుగా విభజించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మల్లాది ఈ వ్యాఖ్యలు చేశారు.

Chandrababu
Telugudesam
Pawan Kalyan
Jana Sena
YSRCP
Malladi Vishnu
  • Loading...

More Telugu News