Janasena: జనసేన కార్యకర్తలపై కేసులు కొట్టివేసిన హైకోర్టు

  • ధర్మవరంలో జనసేన కార్యకర్తలపై కేసులు
  • హైకోర్టులో సవాల్ చేసిన జనసేన లీగల్ సెల్
  • పూర్వాపరాలు పరిశీలించకుండా ఎలా కేసులు పెడతారని ప్రశ్నించిన హైకోర్టు

గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరంలో ఇటీవల జనసేన కార్యకర్తలు ప్రదర్శించిన నాటకం వివాదాస్పదం అయింది. ఈ ఘటనలో కొందరు జనసేన కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 34 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. దీన్ని జనసేన పార్టీ హైకోర్టులో సవాల్ చేసింది. అక్రమ కేసులు బనాయించారంటూ జనసేన లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించింది. జనసేన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం జనసేన కార్యకర్తలపై పోలీసులు పెట్టిన కేసులను కొట్టివేసింది. ఘటన పూర్వాపరాలు పరిశీలించకుండా కేసులు ఎలా పెడతారంటూ హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది.

Janasena
Andhra Pradesh
Police
High Court
YSRCP
  • Loading...

More Telugu News