jyotiraditya scindia Congress leader: నేను కాంగ్రెస్ ను వీడటం లేదు: కాంగ్రెస్ జ్యోతిరాదిత్య సింధియా

  • ట్విట్టర్లో నా బయోడేటాను చిన్నగా మార్చాను అంతే..
  • ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ బదులు, ప్రజాసేవకుడని రాసుకున్నాను
  • నేను పార్టీ మారతానని వస్తోన్న వార్తలన్నీ నిరాధారమైనవే

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ను ఒకప్పుడు పరిపాలించిన రాజ కుటుంబానికి చెందిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా తన ట్విట్టర్ ఖాతాలో వ్యక్తిగత విషయాలను అప్ డేట్ చేసే క్రమంలో కాంగ్రెస్ అన్న పదాన్ని తొలగించడంతో అటు మీడియాలో, ఇటు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ స్థానంలో తాను ప్రజా సేవకుడు, క్రికెట్ ప్రేమికుడనని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ నేతల్లో సింధియా పార్టీ మారతారని ఊహాగానాలు చెలరేగాయి. రాహుల్ గాంధీతో అత్యంత సామీప్యత ఉన్న నేతగా సింధియా పేరుపొందటంతో కాంగ్రెస్ వర్గాల్లో కూడా దీనిపై చర్చలు ఊపందుకున్నాయి. దీనిపై మీడియా ప్రతినిధులు సింధియా నుంచి వివరణ కోరగా.. అవన్నీ పుకార్లేనని చెప్పారు. తాను కాంగ్రెస్ ను వీడటం లేదని స్పష్టం చేశారు. ‘నెల రోజుల కిందట బయోడేటాను మార్పులు చేశాను. నా బయోడేటా క్లుప్తంగా ఉంటే బాగుంటుందని కొందరు సూచించడంతో నేను అలా చేశాను. ఈ నిర్ణయం వెనక మరే కారణంలేదు. నేను పార్టీ మారతానని వస్తోన్న వార్తలన్నీ నిరాధారమైనవి’ అని సింధియా చెప్పారు.

jyotiraditya scindia Congress leader
Madhya Pradesh
Removal Of Congress word in His Twitter bio-data
Clarification
  • Loading...

More Telugu News