Devendra Fadnavis: సీఎంగా బాధ్యతలను స్వీకరించిన ఫడ్నవీస్.. తొలి సంతకం దేనిపై చేశారంటే..!

  • సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుపై సంతకం చేసిన ఫడ్నవీస్
  • కుసుమ్ వెంగర్లేకర్ అనే మహిళకు అందజేత
  • ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సీఎంఓ

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శనివారంనాడు ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్... ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. సీఎంగా రెండోసారి బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన తన తొలి సంతకాన్ని ఒక చెక్కుపై చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన ఆ చెక్కును ఓ మహిళకు ఆయన అందజేశారు. సెక్రటేరియట్ కు వచ్చిన ముఖ్యమంత్రి చెక్కుపై తొలి సంతకం చేసి కుసుమ్ వెంగర్లేకర్ అనే మహిళకు అందించారని ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ ఉదయం దాదాపు 80 నిమిషాల పాటు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత రేపు తీర్పును వెలువరిస్తామని తెలిపింది. సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా పడిన వెంటనే... ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలను చేపట్టారు.

Devendra Fadnavis
Maharashtra
Chief Minister
First Signature
  • Loading...

More Telugu News