Venkatesh: సరదాగా సాగే పాత్రలో సందడి చేయనున్న వెంకటేశ్

  • వినోదభరిత చిత్రంగా 'వెంకీమామ'
  • వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ 
  • చైతూ జోడీగా రాశి ఖన్నా

వెంకటేశ్ .. నాగచైతన్య ప్రధాన పాత్రధారులుగా 'వెంకీమామ' నిర్మితమైంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, వెంకటేశ్ పాత్ర చాలా సరదాగా సాగిపోతుందని అంటున్నారు. తెరపై వెంకటేశ్ చేసే సందడి ఒక రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. మధ్య వయస్కుడిగా ఈ సినిమాలో కనిపించే వెంకటేశ్ కి పాయల్ పరిచయమైన దగ్గర నుంచి ఆయన ధోరణి పూర్తిగా మారిపోతుందట.

అప్పటి నుంచి ఆయన గ్లామర్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టడం .. ఆమె గురించిన ఆలోచనల్లో మునిగిపోవడం .. సిగ్గుతో మెలికలు తిరిగిపోవడం గట్రా చేస్తాడట. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని అంటున్నారు. ఇక చైతూ జోడీగా రాశి ఖన్నా నటించగా, ముఖ్యమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ .. పోసాని కనిపించనున్నారు.

Venkatesh
Payal
Chaitu
Rasi Khanna
  • Loading...

More Telugu News