shiv sena: ఓ హోటల్ లో 'ఆపరేషన్ కమల్' కొనసాగింది: సంజయ్ రౌత్

  • సీబీఐ, ఈడీ, ఐటీ, పోలీసు శాఖల అధికారులను వినియోగించుకున్నారు
  • మహారాష్ట్రలో వారి ప్రయత్నాలు ఫలించలేదు
  • బీజేపీకి నిజంగా మెజారిటీ ఉంటే ఆపరేషన్ కమల్ ప్రయత్నాలు ఎందుకు? 
  • గురుగ్రామ్ లోని హోటల్ కు వెళ్లి మేము 'రెస్క్యూ ఆపరేషన్' కొనసాగించాం

బీజేపీపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ఆపరేషన్ కమల్ కోసం బీజేపీ.. నాలుగు వ్యవస్థల్లోని వారిని  వినియోగించుకుంటోంది.. వారే సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను, పోలీసు శాఖల అధికారులు. కానీ, మహారాష్ట్రలో వారి ప్రయత్నాలు ఫలించలేదు. బీజేపీకి నిజంగా మెజారిటీ ఉంటే ఆపరేషన్ కమల్ ప్రయత్నాలు ఎందుకు?' అని ప్రశ్నించారు.

మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని సంజయ్ రౌత్ తెలిపారు. 'అజిత్ పవార్ కు మద్దతు తెలుపుతూ వెళ్లిన వారు తిరిగి వస్తున్నారు. గురు గ్రామ్ లోని ఓ హోటల్ వేదికగా ఈ ఆపరేషన్ జరిగింది. నిన్న రాత్రి శివసేన, ఎన్సీపీ నేతలు అక్కడకు వెళ్లి 'రెస్క్యూ ఆపరేషన్' కొనసాగించారు' అని తెలిపారు. వారిని అక్కడి నుంచి తీసుకొచ్చారని వివరించారు. 'బీజేపీ తమను బెదిరింపులకు, ప్రలోభాలకు గురి చేసిందని గురుగ్రామ్ లోని హోటల్ లో ఉన్న ఎమ్మెల్యేలు  చెప్పారు' అని వ్యాఖ్యానించారు.

shiv sena
BJP
Maharashtra
  • Loading...

More Telugu News