Buddha venkanna: 3 నెలల్లో జగన్ గారు జైలుకి పోతారని, సీఎం పదవి ఊడిపోతుందని మీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది: విజయసాయికి బుద్ధా వెంకన్న కౌంటర్

  • విజయసాయి రెడ్డికి చురకలంటించిన బుద్ధా వెంకన్న 
  • వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు జరిగే పరిణామాలను పసిగట్టినట్లున్నారు
  • అందుకే బీజేపీతో టచ్ లో ఉన్నారట

వచ్చే ఆరు నెలల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కేసులైనా తప్పించుకోవచ్చని బీజేపీ చంక ఎక్కడానికి చూస్తున్నారని ఆయన చేసిన ఆరోపణలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు.

'వచ్చే ఆరు నెలల్లో చంద్రబాబు గారికి ప్రతిపక్ష హోదా ఉండదు అని చిలక జోస్యం చెప్పిన విజయసాయి రెడ్డి గారికి మూడు నెలల్లో వైఎస్ జగన్ గారు జైలుకి పోతారని, ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందని తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది' అని ట్వీట్ చేశారు.
 
'వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు జరిగే పరిణామాలను పసిగట్టినట్టు ఉన్నారు.. అందుకే బీజేపీతో టచ్ లో ఉన్నారట. అందుకే జగన్ గారు, మీరు ఢిల్లీలో తలవంచుకొని నిలబడుతున్నారటగా' అని బుద్ధా వెంకన్న చురకలంటించారు.

వైఎస్ జగన్ కి తెలుగు చూస్తూ కూడా చదవడం రాదని బుద్ధా వెంకన్న విమర్శించారు. 'తెలుగు చూసి చదవడం, ఇంగ్లిష్ చూడకుండా పలకడం రాని తింగరి మాలోకాన్ని బాహుబలి చెయ్యాలనే మీ కామెడీ అదుర్స్ సాయి రెడ్డి గారు' అని పేర్కొన్నారు.

Buddha venkanna
BJP
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News