Shiva: మరో ప్రేమకథగా 'చూసీ చూడంగానే' .. లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

  • హీరోగా శివ కందుకూరి పరిచయం 
  •  సంగీత దర్శకుడిగా గోపీసుందర్ 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు

తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి మరో ప్రేమకథ సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరే 'చూసీ చూడంగానే'. ఈ సినిమా ద్వారా శివ కందుకూరి హీరోగా పరిచయమవుతున్నాడు. నిర్మాత రాజ్ కందుకూరి తనయుడే ఈ శివ కందుకూరి. ఈ సినిమా హీరోయిన్ 'వర్ష'కి కూడా ఇదే తొలి సినిమా. తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

"వెనకనే వున్నా నీ కోసం .. ఒక క్షణమైనా చూశావా, నీ ఎదురుగా .. ఓ బెదురుగా నిలబడలేక వెనకే .." అంటూ ఈ పాట సాగుతోంది. గోపీసుందర్ సంగీతం .. అనంత శ్రీరామ్ సాహిత్యం .. చిన్మయి శ్రీపాద ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. అనంత శ్రీరామ్ పదాల గారడితో ఈ పాట హాయిగా మనసును తాకుతోంది. శేష సింధూరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా, యూత్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News