Bangladesh: వచ్చే ఏడాది నుంచి అదే పనిలో ఉంటాం: ఓటమిపై బంగ్లాదేశ్ కెప్టెన్ వ్యాఖ్యలు

  • టీమిండియాతో టెస్టు సిరీస్ లో బంగ్లా ఓటమి
  • ఒత్తిడిని అధిగమించలేకపోయాయన్న బంగ్లా కెప్టెన్
  • మానసికంగా బలోపేతం అయ్యేందుకు శ్రమిస్తామని వెల్లడి

టీమిండియా చేతిలో దారుణ పరాజయాలపై బంగ్లాదేశ్ జట్టు ఆత్మవిమర్శ చేసుకుంటోంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ ఓటమి చవిచూసిన బంగ్లా ఆ తర్వాత పింక్ బాల్ తో జరిగిన డేనైట్ టెస్టులోనూ దారుణమైన రీతిలో చతికిలపడింది. దీనిపై బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్ మొమనుల్ హక్ మాట్లాడుతూ, టెస్టుల్లో మానసిక ఒత్తిడిని అధిగమించలేక తాము ఓటమిపాలయ్యామని తెలిపాడు.

తమ బలహీనతలపై భారత బౌలర్లు గురిచూసి కొట్టారని, ఈ అనుభవాలు తమను మరింత బలమైన జట్టుగా ఎదిగేందుకు దోహదపడతాయని భావిస్తున్నామని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది తాము 10 టెస్టులు ఆడాల్సి ఉందని, ఇకమీదట ఒత్తిడిని ఎదుర్కోవడంపైనే తమ ప్రధాన దృష్టి ఉంటుందని, వచ్చే ఏడాది నుంచి ఆ అంశంపైనే కసరత్తులు చేస్తామని మొమినుల్ హక్ వెల్లడించాడు.

Bangladesh
Mominul Haq
Cricket
India
  • Loading...

More Telugu News