India: మాకు చాలా సమయం పట్టింది... ఓటమిపాలైన బంగ్లాదేశ్ కు టీమిండియా కోచ్ సలహా

  • భారత పర్యటనలో బంగ్లాదేశ్ ఓటములు
  • బౌలింగ్ విభాగం బలంగా ఉండాలన్న శాస్త్రి
  • 15 నెలలుగా ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని వెల్లడి

భారత పర్యటనలో చేదు అనుభవాలు చవిచూసిన బంగ్లాదేశ్ జట్టుకు టీమిండియా కోచ్ రవిశాస్త్రి విలువైన సలహా ఇచ్చారు. విదేశాల్లో గెలవాలంటే బౌలింగ్ విభాగం బలంగా ఉండాలని, తాము ఈ స్థితికి రావడానికి చాలా సమయం పట్టిందని తెలిపారు. 15 నెలల నుంచి విదేశాల్లో సిరీస్ లు ఆడుతూ తమ బౌలర్లు ప్రతిమ్యాచ్ ను ఓ పాఠంలా స్వీకరించారని, ఆ కృషి ఫలితమే ఇప్పుడిలా రాణిస్తున్నారని రవిశాస్త్రి వెల్లడించారు.

పిచ్ పరిస్థితిని ఎంత త్వరగా అర్థం చేసుకోగలరన్నదానిపైనే బౌలర్ల ప్రదర్శన ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని తాము గుర్తించామని, తమ బౌలర్ల విజయాల్లో అదే కీలకంగా మారిందని వివరించారు. బంగ్లాదేశ్ కూడా పటిష్టమైన ఫాస్ట్ బౌలింగ్ విభాగం తయారుచేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. టీమిండియా పేస్ బౌలింగ్ ను ఆదర్శంగా తీసుకుని విదేశీ సిరీస్ లు ఆడేందుకు సిద్ధం కావాలని తెలిపారు.

  • Loading...

More Telugu News