Virat Kohli: దీనికి ఆద్యుడు దాదానే... ఆయన స్ఫూర్తితోనే ఫలితాలు రాబడతున్నాం: కోహ్లీ

  • కోల్ కతా టెస్టులో టీమిండియా ఘనవిజయం
  • తొలి డేనైట్ టెస్టును చిరస్మరణీయం చేసుకున్న కోహ్లీ సేన
  • మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్

విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు సొంతగడ్డపై మరో ఘనవిజయం దక్కింది. తొలిసారిగా డేనైట్ టెస్టు ఆడిన భారత్ అన్నిరంగాల్లో రాణించి బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. కోల్ కతాలో మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, టెస్టు క్రికెట్ లో ఆలోచనా శక్తితో విజయాలు సాధించడం ఎలాగో గంగూలీనే చేసి చూపించాడని, ఇప్పుడు తాము ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నామని తెలిపాడు.

 టెస్టు క్రికెట్ అనేది మానసిక యుద్ధం అయితే, ఆ పోరాటాన్ని ఎలా గెలవాలో నేర్పించిన ఆద్యుడు గంగూలీ అని కోహ్లీ కొనియాడాడు. దాదా నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసంతో కఠినంగా పరిశ్రమించి, ఆ పరంపరను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నామని వివరించాడు.

Virat Kohli
Ganguly
India
Bangladesh
Cricket
  • Loading...

More Telugu News