Kala Venkatrao: రాజధానిపై మంత్రులు పూటకో మాట మాట్లాడుతున్నారు: కళా వెంకట్రావు

  • వైసీపీ ప్రభుత్వంపై కళా ధ్వజం
  • పరిశ్రమలు ఎందుకు వెనక్కి వెళుతున్నాయో చెప్పాలన్న కళా
  • జగన్ హోదాపై ఎందుకు మాట్లాడడంలేదంటూ ఆగ్రహం

టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. రాజధానిపై మంత్రులు పూటకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఎందుకు వెనక్కి వెళుతున్నాయో వైసీపీ నేతలు చెప్పాలని నిలదీశారు. 22 మంది ఎంపీలుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ అన్నారని, ఆయన ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఇక సుజనా చౌదరి ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా కళా స్పందించారు. ప్రస్తుతం టీడీపీని వీడి ఎవరూ వెళ్లబోవడంలేదని, మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులను తయారుచేసే కర్మాగారం అని అన్నారు.

Kala Venkatrao
Telugudesam
YSRCP
Jagan
Andhra Pradesh
  • Loading...

More Telugu News