Virat Kohli: కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు: పుజారా

  • పింక్‌బాల్‌ తో మ్యాచ్ ఆడాము
  • శతకంతో కెప్టెన్‌ గర్వపడి ఉంటాడు
  • అభిమానులతో పెద్ద ఎత్తున మైదానానికి వచ్చారు

టీమిండియా కెప్టెన్ కోహ్లీ నిజంగా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడని టీమిండియా ఆటగాడు పుజారా అన్నాడు. పింక్‌బాల్‌ తో ఆడిన మ్యాచ్ లో చేసిన శతకంతో కెప్టెన్‌ గర్వపడి ఉంటాడని అన్నాడు. అభిమానులతో పెద్ద ఎత్తున మైదానానికి వచ్చి ప్రోత్సాహం లభిస్తే తమకు ఎంతో ప్రేరణ కలుగుతుందని చెప్పాడు. సంప్రదాయ క్రికెట్‌ ఇంకా బతికే ఉందని, ఈ ఫార్మాట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఈ మ్యాచ్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.
 
ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ అంతగా రాణించలేకపోతోన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ నాలుగు రోజులు కూడా సాగకపోయినా తమకు మంచి అనుభవం మిగలనుందని పుజారా అన్నాడు. డేనైట్‌ టెస్టును ప్రేక్షకులు కూడా ఆస్వాదిస్తున్నారని ఆయన తెలిపాడు. బంగ్లా ఆటగాళ్ల హెల్మెట్లకు బాల్ తగలడానికి వెలుతురు, పింక్‌ బాలే కారణాలని ఆయన అభిప్రాయపడ్డాడు. టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్‌మెన్‌ సరిగ్గా ఆడలేకపోతున్నారని చెప్పాడు.

Virat Kohli
Cheteshwar Pujara
Cricket
  • Loading...

More Telugu News