nama nageswara rao: లోక్‌సభ జనరల్ పర్పస్ కమిటీ సభ్యులుగా టీఆర్ఎస్, వైసీపీ ఎంపీల నియామకం

  • బులెటిన్ విడుదల చేసిన లోక్‌సభ సచివాలయం
  • కమిటీలో మొత్తం 45 మంది సభ్యులు
  • ప్రత్యేక ఆహ్వానితులుగా పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి

టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మిథున్‌ రెడ్డి, రఘురామ కృష్ణంరాజులు లోక్‌సభ జనరల్‌ పర్పస్‌ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. లోక్‌సభ స్పీకర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో మొత్తం 45 మంది సభ్యులు ఉన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఆ శాఖ సహాయ మంత్రులు అర్జున్‌‌రాం మేఘవాల్‌, వి.మురళీధరన్‌‌లు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. టీఆర్ఎస్ ఎంపీ నామా, వైసీపీ ఎంపీలను కమిటీ సభ్యులుగా నియమించినట్టు శనివారం లోక్‌సభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది.

nama nageswara rao
TRS
YSRCP
mithun reddy
Raghurama krishnam raju
  • Loading...

More Telugu News