Subramanian Swamy: ఈ సినిమా గారడీ వాళ్ల వల్ల ఒరిగిందేమీ లేదు... రజనీకాంత్, కమలహాసన్ లపై సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు

  • ఇటీవలే పరస్పరం సానుకూల ప్రకటనలు చేసిన రజనీ, కమల్
  • సినిమాల ప్రచారం కోసమే కలిశారని ఆరోపణ
  • విన్యాసాలు చేస్తున్నారని వ్యాఖ్యలు

రాజకీయాల్లో బుడిబుడి అడుగులు వేస్తున్న సినీ నటులు కమలహాసన్, రజనీకాంత్ లపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు చేశారు. రజనీ, కమల్ కలిసినంత మాత్రాన తమిళనాడుకు ఒరిగేదేమీ లేదని పెదవి విరిచారు. త్వరలో విడుదల కాబోతున్న తమ సినిమాల పబ్లిసిటీ కోసమే రజనీకాంత్, కమలహాసన్ విన్యాసాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సినిమా గారడీ వాళ్లు రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Subramanian Swamy
BJP
Rajinikanth
Kamal Haasan
Tamilnadu
  • Loading...

More Telugu News