Kishan Reddy: ఎంత కష్టమైనా ప్రశాంత్ ను భారత్ తీసుకువస్తాం: కిషన్ రెడ్డి

  • పాక్ భూభాగంలో ప్రవేశించిన తెలుగు యువకుడు
  • అక్రమంగా ప్రవేశించాడంటున్న పాక్
  • దౌత్య కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కిషన్ రెడ్డి వెల్లడి

తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడంటూ ప్రశాంత్ అనే తెలుగు యువకుడ్ని పాకిస్థాన్ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. ప్రేమ వ్యవహారంలో దెబ్బతిన్న ప్రశాంత్ మానసిక వ్యాకులతకు లోనై పాకిస్థాన్ లో ప్రవేశించి ఉంటాడని భావిస్తున్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రశాంత్ ను భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, పాకిస్థాన్ లోని భారత దౌత్య కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ఎంత కష్టమైనా ప్రశాంత్ ను భారత్ తీసుకువస్తామని స్పష్టం చేశారు.

Kishan Reddy
Prashant
Pakistan
India
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News